NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ 

1 min read

హోళగుందన్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలోని హెబ్బటం గ్రామం లో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహ ఏర్పాటు కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటుచేసిన స్థల ప్రాంగణంలో   గౌరవ నీయులు ప్రజా నాయకుడు తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి  మరియు ముఖ్య అతిథులుగా హొళగుంద ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సింగిల్ విండో చైర్మన్ హెబ్బటం విష్ణువర్ధన్ రెడ్డి,  చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ భూమి పూజనుశుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌరవ నీయులు ప్రజా నాయకుడు చిన్నహ్యట శేషగిరి మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,  విగ్రహమునకు భూమి పూజ ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా హర్షించదగ్గ విషయమన్నారు.. హెబ్బటం గ్రామం ప్రజలకు మరియు ముఖ్యంగా గ్రామ యువత, యువతీ, ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.ఆ మహనీయుడును అంబేద్కర్ ని ప్రతి ఒక్కరు  స్ఫూర్తి స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రతీ ఊరిలో ప్రతీ వాడాలో ఇదేవిదంగా మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.ఆ మహానుభావుడిని కొందరు అజ్ఞానులు కొన్ని వర్గాలకే పరిమితం అనుకోని భ్రమలో ఉన్నారన్నారు….కానీ ఆయన ప్రపంచానికి వెలుగు నిచ్చిన సూర్యుడు అని కొందరి అజ్ఞానులకు తెలియదన్నారు.కానీ ఆ మహానుభావుడి విగ్రహం ఇదేవిదంగా ప్రతీ ఊరిలో ప్రతీ వాడాలో ఉండేవిదంగా ఆయన ఆశయం, ఆలోచన ప్రతీ ఊరిలో ఇదేవిదంగా చైతన్యంతో, ఏకతాటిగా ముందు వచ్చి ఇంతటి కార్యక్రమంను దిగ్విజయం చేసిన హెబ్బటం గ్రామంలో గల  అన్ని వర్గాల  ప్రజలకు అభినందనలు తెలియచేశారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా హొళగుంద ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సింగిల్ విండో చైర్మన్ హెబ్బటం విష్ణువర్ధన్ రెడ్డి, గారు, హెబ్బటం దళిత సీనియర్ నాయకులు పక్కిరప్ప, సర్పంచ్ నరసప్ప, సవారప్ప, హెబ్బటం మల్లి, ఎమ్మార్పీఎస్  మండలం అధ్యక్షులు కేంచప్ప, దళిత సీనియర్ నాయకులు మల్లికార్జున, చిన్నహ్యట దేవప్ప,కాళప్ప, సూగురు నాగేష్, మాణిక్యం షేక్షవలి, ఎంపీటీసి ఉరుకుందు, గోవిందప్ప, శ్రీనప్ప, రామాంజి, కురువ రంగస్వామి, మాల శేఖర్, పెద్ద పక్కిరప్ప, గోసంగి సవారీ, బజారప్ప, నారాయణ, గాదిలింగ, ముసిలాప్ప, తిప్పేరుద్ర, ఉసెని, తాయాప్ప, బోరింగ్ సవారప్ప, ఇస్వి శేఖన్న, తలారి ఈరప్ప, భీమా, తిక్కయ్య, బుడ్డా ఈరప్ప,తప్పిట మల్లి, గుడిసలి నాగరాజు, హెల్త్ నాగరాజు, హనుమంతు (జార్జ్ ), వరాల శేఖర్ ,చిన్నహ్యట నాగరాజు,మార్లమడికి భాస్కర్, ఎర్రిస్వామి, గోవిందు,  భారీ పెద్ద ఎత్తున హెబ్బటం గ్రామం ప్రజలు పాల్గొన్నారు.

About Author