NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం ఉత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు : ప్యాపిలి పట్టణంలో మరియు గ్రామాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సీతారాముల దేవాలయంలో సీతారాముల స్వామి వారికి  దీప, ధూప, వస్త్రాలు,నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని బండగేరి వెలసిన సీతారాముల లకు, క్రింది గేరిలో వెలిసిన సీతారాముల దేవాలయంలో, నేసే పేటలో ని సీతారాముల కల్యాణ కట్ట దగ్గర, మండల పరిధిలోని చిన్న పూజర్ల, పెద్దపూజర్ల ,ఎస్ రంగాపురం, కలచట్ల ,జలదుర్గం, ఊటకొండ ,హుస్సేనాపురం, చండ్రపల్లి గల గ్రామాలలో సీతారాముల దేవాలయంలో భక్తిశ్రద్ధలతో సీతారాములకు కళ్యాణం నిర్వహించి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పాడిపంటలు కొలువు తీరి ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలు  కలగాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

About Author