NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా జననేత వైకుంఠం శివప్రసాద్ జన్మదిన వేడుక

1 min read

తెలుగుయువత మండల అధ్యక్షులు బకాడి వీరేష్

హోళగుందన్యూస్ నేడు: ఆలూరు మాజీ ఇంచార్జీ, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  వైకుంఠం శివప్రసాద్ జన్మదిన వేడుకలకు   తెలుగుయువత హొళగుంద మండల అధ్యక్షులు బకాడి వీరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల కన్వీనర్ తిప్పయ్య, తెలుగుయువత మండల అధ్యక్షులు బకాడి విరేష్, సింగిల్ విండో డైరెక్టర్ కోనేరు దుర్గయ్య, వైకుంఠం యువసేన ల్యాబ్ గిరి, బూత్ ఇంచార్జి వలిబాష, ఐ-టిడిపి  క్లస్టర్ ఇంచార్జి వీరేంద్ర, అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాదర్ బాషా, జే.సురేష్, తెలుగుయువత ప్రధాన కార్యదర్శి తరుణ్, యూనిట్ ఇంచార్జ్ ఐకల్ మల్లి, కోక్లస్టర్ రారవి సిద్ద, తదితరుల సమక్షంలో హొళగుంద ప్రాథమిక ఆరోగ్య  కేంద్రంలో రోగులకు బ్రెడ్లు, సీతల పానియాలను పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుయువత మండల అధ్యక్షులు బకాడి వీరేష్ మాట్లాడుతూ నాయకత్వానికి అసలైన నిర్వచనంగా నిలిచిన టిడిపి మాజీ ఇంచార్జివర్యులు  వైకుంఠం శివ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆలూరు తాలూకా వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించ బడుతున్నాయని, ఆలూరు అగ్గిపిడుగు వైకుంఠం శివప్రసాద్ అన్నపై తమ అభిమానం ఎల్లప్పుడూ చెరిగిపోనిదని, వైకుంఠం దంపతుల స్ఫూర్తితోనే మొన్నటి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులకు అట్టాల పంపిణి మరియు నేటి జన్మదిన వేడుకలకు హొళగుంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్లు, సీతల పానియాలను పంపిణి చేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది మరియు కోగిలతోట శేషిరెడ్డి, చాకలి నాగేంద్ర, వాల్మీకి సీను, శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *