NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి వారం రోజుల జైలు శిక్ష

1 min read

గూడ్స్ వాహనంలో ప్రయాణికులను ఎక్కించి ప్రమాదకరంగా డ్రైవింగ్ – ఎస్సై దిలీప్ కుమార్ హెచ్చరిక

హోళగుందన్యూస్ నేడు: హాలహార్వి మండలం  గుళ్ళెంగ్రామానికి చెందిన షేక్షావలి అనే వ్యక్తి మద్యం సేవించి గూడ్స్ వాహనంలో ప్రజలను ఎక్కించుకొని ప్రమాదకరంగా వాహనం నడిపిన ఘటనలో కోర్టు కఠినంగా స్పందించింది. ఈ కేసును విచారించిన గౌరవ ఆలూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్  సంబంధిత వ్యక్తికి వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ రిమాండ్‌కు పంపారు.ఈ సందర్భంగా హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, ముఖ్యంగా గూడ్స్ క్యారియర్ వాహనాల్లో ప్రజలను ఎక్కించి ప్రయాణం చేయించడం తీవ్ర నేరమని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు.అలాగే గూడ్స్ వాహనాల్లో చెక్క ప్లేట్లు అమర్చి అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author