గంగమ్మ జాతరకు చలవ పందిల్లు
1 min read
చెన్నూరు, న్యూస్ నేడు: శనివారం రాత్రి నుండి ఆదివారం నాడు జరిగే గంగమ్మ జాతరకు, జాతర నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ముఖ్యంగా చలువ పందిళ్ల తో జాతర శోభకు కొట్టొచ్చినట్లైంది. గంగమ్మ జాతరకు చెన్నూరు తో సహా మండలంలోని అన్ని పంచాయతీల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఉగాది పర్వదినానికి ముందు వచ్చే ఆదివారం నాడు నిర్వహించే జాతర (దేవర)) ఆనవాయితీగా మండల ప్రజలు జరుపుకోవడం జరుగుతుంది. శనివారం రాత్రి ఆదివారం గంగమ్మ, గౌరమ్మ ప్రతిమలు ఏర్పాటుచేసి బాజా, భజన్త్రీలతో, భారీ ఎత్తున పాల్గొనే భక్తుల కోలాహాల మధ్య అమ్మవారి ప్రతిమలను జాతర జరిగే ప్రదేశంలో కొలువు తీరడం జరుగుతుంది. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.