ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి : ఏఐ ఎస్ఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలో చదువుల రామయ్య భవనంలో సోమవారం ఏఐఎస్ఎఫ్ మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశం మండల కార్యదర్శి నజీర్ అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న సిపిఐ సీనియర్ నాయకులు భీమ లింగప్ప సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శి రాజ సాహెబ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని , రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద విద్యార్థులందరికీ విద్య దీవెన వసతి దీవెన అమ్మ ఒడి ఇస్తానని చెప్పి తీరా ఇప్పుడు షరతులు విధించి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రంలో నూతన విద్యా విధానం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు చదువును అందని ద్రాక్షాల చేస్తున్నారని వారు వాపోయారు. పత్తికొండ పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని చాలామంది ఈ ప్రాంత విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి అవస్థలు పడుతూ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేశారు అనంతరం పట్టణ మరియు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా B.వినోద్, రమేష్, మండల అధ్యక్ష, కార్యదర్శులుగా సమీర్, శివ తో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. సమావేశంలో మండల కార్యదర్శి రామాంజనేయులు, ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి హనుమేష్, ఏఐఎస్ఎఫ్ మద్దికేర మండల కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అహ్మద్, పవన్, వినోద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.