NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బదిలీ, పదవి విమరణ వారికి ఘన సన్మానం

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంగారెడ్డి, డాక్టర్. రాహుల్  ఆధ్యర్యంలో మంగళవారం ఆశ డే సమీక్ష సమావేశం తో పాటు సన్మాన కార్యక్రమంను బదిలీ పై వేరే ప్రాంతం నకు వెళ్లిన డాక్టర్ వాణిశ్రీ,  రిటైర్మెంట్ ఐన రోజమేరీ , గంగాదేవి,బదిలీ పైన వెళ్లిన ఎఎన్ ఎం  లు ధరణి,కేశమ్మ, ప్రభావతి, అటెండర్ విశ్వకుమార్ కు వారు చేసిన సేవలను కొనియాడుతూ వారికి శాలువలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధులు తాము నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించి మన కర్తవ్యం తప్పకుండా నిర్వహించినప్పుడే మనకు మంచి పేరు లభిస్తుందని అన్నారు. అలాగే మనం కూడా ప్రజలకు సేవ చేసి ఆసుపత్రి కి మంచి పేరు తీసుకొని రావాలేనని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాజారావు, రామచంద్ర రెడ్డి, సుమతి దేవి, రాఘవేంద్ర గౌడు, మనోహర్ రెడ్డి, సరోజ ,ఎం ఎల్ ఎచ్ పి లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author