శ్రీశ్రీశ్రీ వినాయక చవితి నవరాత్రుల మహోత్సవాలు 11వ వార్షికోత్సవం
1 min read
విజయవాడ న్యూస్ నేడు : లబ్బీపేట వైవి రావు హాస్పిటల్ రోడ్ లో లబ్బీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల 11వ వార్షికోత్సవం మహోత్సవములు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కందుల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి శ్రీశ్రీశ్రీ వినాయక చవితి నవరాత్రి మహోత్సవంలో నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం 11వ వార్షికోత్సంగా ఈ నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ మూడో తేదీన 5000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు సెప్టెంబర్ 6 తేదీన శ్రీ వరసిద్ధి వినాయకుని 9 కేజీల లడ్డు వేలంపాటి నిర్వహిస్తున్నామని డీజే తీన్మార్ కోలాటం సన్నాయిమేళం తప్పట్లు మేళతాళాలతో వరసిద్ధి వినాయకుని ఊరేగించి నిమజ్జన కార్యక్రమం జరుపుతున్నామని తెలిపారుఈ తొమ్మిది రోజులు నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా 25 మంది కళాకారులు చే భరతనాట్య నృత్య ప్రదర్శన భాగవతల సోమయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడిందినవరాత్రుల సందర్భంగా నిత్యము శ్రీ వరసిద్ధి వినాయకునికి భక్తులకు ప్రసాదాలు సమర్పించిన వారు జాగరపు నాగేశ్వరావు ని తెలిపారు.ఈ లబ్బీపేటలో ఉన్న ముస్లిం సోదరులందరూ శ్రీ శ్రీ శ్రీ వినాయక నవరాత్రి మహోత్సవములకు మాతో మమేకమై అన్ని విధాలసహకరించినందుకు ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మండపానికి సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్ ఇచ్చిన సిటీస్ పోలీస్ కమిషనర్ కి మున్సిపల్ కమిషన్ కి ఉచిత కరెంటు ఇచ్చిన విద్యుత్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధ లతో క్రమశిక్షణగా ఎటువంటి అవాంతరాలు జరగకుండా కష్టపడి పని చేసిన కమిటీ సభ్యులు అల్లం శ్రీనివాస్ హరీష్ ఎన్ వెంకటరెడ్డి జి ఆది కే రాజు కే రాంబాబు పి సాయి ఫణి తదితరులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారని తెలిపారు.


