NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికులతో కలిసి రోడ్డుపై చీపురు పట్టిన మున్సిపల్ చైర్మన్

1 min read

చెత్త లారీకి చెత్తను ఎక్కించిన శ్రీరామ్ చినబాబు

మున్సిపల్ కార్మికులకు నేను విన్నాను, ఉన్నాను అంటూ భరోసా

మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిది  : పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా మదన పల్లె మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు గుండ్ల పల్లి శ్రీరామ్ చిన బాబు స్వయంగా పారిశుద్ధ్య కార్మికుల తో కలిసి  రోడ్లపై చీపురు పట్టి శుభ్రం చేశారు. అంతే కాకుండా కార్మికుల తో కలిసి చెత్తను సేకరించి మున్సి పల్ చెత్తలారీలో ఎక్కించే పనిలోనూ పాల్గొని అందరినీ ఆకట్టు కున్నారు. పట్టణంలోని ఎన్వీఆర్ లేఅవుట్‌ లో  సోమవారం తెల్లవారు జామున శ్రీరామ్ చినబాబు పర్యటించారు. ఈ సందర్భంగా  ఎంఎంసీ పార్క్ పరిసరాలతో పాటు రోడ్లపై పారిశుద్ధ్య పనులు నిర్వహి స్తున్న మున్సిపల్ కార్మికులను నేరుగా కలుసు కున్నారు. వారి పనితీరును పరిశీలించడంతో పాటు స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. కార్మికులతో కలిసి చెత్తను సేకరించి చెత్త తరలింపు వాహనంలో ఎక్కించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయంగా మాట్లాడి వారి వ్యక్తిగత, విధి నిర్వహణకు సంబంధించిన సమస్య లను అడిగి తెలుసు కున్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సావధానంగా విన్న ఆయన, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విధి నిర్వహణ లో కార్మికులకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకు రావాలని, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీరామ్ చినబాబు మాట్లా డుతూ నేను విన్నాను, నేను ఉన్నానని మున్సి పల్ కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాను. పట్టణాన్ని పరి శుభ్రంగా ఉంచ డంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకం. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించా లని, మదనపల్లె ను పరిశుభ్రమైన, సుందర మైన నగరంగా తీర్చి దిద్దేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *