కొత్తరకం వైరస్.. పిల్లలకు ప్రమాదం
1 min readపల్లెవెలుగువెబ్ : కేరళ రాష్ట్రంలో కొత్తరకం నోరో వైరస్ అంటువ్యాధి ప్రబలింది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధృవీకరించారు. నోరోవైరస్ డయేరియా-ప్రేరేపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు.