రాష్ట్ర ప్రజలకు ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలి..
1 min read
వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ సర్వజన వైద్యశాల,కళాశాల వైద్యుల మరియు నర్సింగ్ మరియు ఇతర సిబ్బంది సేవలు చాలా సంతృప్తికరం..2) నా మాటల్లోనే వేదనను అర్థం చేసుకోవాలని వైద్య వ్యవస్థ అంతా ఒక కుటుంబమని రాష్ట్ర ప్రజలకు ఒక ప్రతిష్టమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలని వైద్యులకు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు…. వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు గౌ.శ్రీ . సత్య కుమార్ యాదవ్… కర్నూల్ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడామని ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల రోగులు సంతృప్తి వ్యక్త పరచారని ఇది తనకి చాలా సంతోషాన్ని ఇచ్చింది అని వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు గౌ.శ్రీ. సత్య కుమార్ యాదవ్ అన్నారు. శనివారం కర్నూలు స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లోని అధునాతన పరికరాలను ప్రారంభించడానికి విచ్చేసిన ఆరోగ్యశాఖ మాత్యులు మెడికల్ కాలేజీలోని వివిధ విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు చేపట్టడం దైవసంకల్పమని అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించేందుకు అవకాశం లభించిందని అన్నారు. ప్రతి రోజు వందల మందికి వైద్యసేవలందిస్తుంటారని రోగులకు పట్ల కొంత ఓర్పు సహనంతో మాట్లాడితే సగం సమస్యలు తీరిపోతాయని వైద్యుల పట్ల కూడా పెరుగుతుందని తద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాయలసీమ కరువు ప్రాంతమని కర్నూల్ వైద్య కళాశాలను ఎయిమ్స్ స్థాయికి తీర్చిదిద్దాలని ఇది చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మంచి చేసిన వారవుతామని ఆయన ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ఎంతో వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో వైద్య సేవల అభివృద్ధికి అరోగ్య శాఖామాత్యులు సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ. ఎస్.ఎం.ఐ.డి.సి చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ గారు, అకాడమిక్ డి.యం.ఇ డాక్టర్ రఘునందన్,మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధూ సుబ్రహ్మణ్యం, ఏడి అనిల్ కుమార్ రెడ్డి, సి ఎస్.ఆర్.యం.ఓ డా. వెంకటేశ్వర రావ్,వివిధ విభాగాల అధిపతులు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
