గడప గడపలో ఎమ్మెల్యే ఆర్థర్ కు పూల వర్షం
1 min read– భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
– జగనన్న ప్రభుత్వాన్ని దీవించండి:ఎమ్మెల్యే -సిద్ధార్థ రెడ్డి వర్గమని పొలాన్ని కొలతలు వేయడం లేదు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ఈకార్యక్రమం ప్రారంభమైంది.ముందుగా ఈకార్యక్రమానికి వచ్చిన నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ కు రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకుర్ మరియు వారి కుమారులు డాక్టర్ మహమ్మద్ రఫీ,మున్నా ఎమ్మెల్యేకు పూలతో ఘన స్వాగతం పలికారు.అంతేకాకుండా గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేకు పూల వర్షం కురిపించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై మంచి పలకరింపులతో ఎమ్మెల్యే ముందుకు సాగారు.తర్వాత వివిధ సమస్యల పైన ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకురాగా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు.ప్రజల నుంచి వచ్చిన సమస్యల పైన ఆ శాఖలకు సంబంధించిన అధికారులను పిలిచి వారి సమస్యలను పెండింగ్ లో లేకుండా వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.గుండం స్వామిరెడ్డి ఇంటి దగ్గర విద్యుత్ స్తంభం శిథిలావస్థలో ఉండటం వలన వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్తంభం వెంటనే మార్చాలని ట్రాన్స్కో ఏఈ కి ఎమ్మెల్యే చెప్పారు.టి. జ్యోతిర్మయి అనే విద్యార్థి బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్నాన ని ఆర్థిక స్తోమత కారణంగా సరిగ్గా చదవలేక పోతున్నానని ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్యేకు మొర పెట్టారు.వెంటనే చలించిన ఎమ్మెల్యే ఆర్థిక సహాయం కొరకు లెటర్ పంపించండని అధికారులను ఆదేశించారు.తర్వాత సిరిగిరి.సుధీర్ కుమార్ అనే వికలాంగుడికి 90 శాతం వికలత్వం ఉందని దివ్యాంగుల పెన్షన్ వస్తూ తొలగించారని తిరిగి మరల పింఛన్ వచ్చే విధంగా చూడాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు తెలిపారు.సిరిగిరి పుల్లయ్య మాట్లాడుతూ 490,498లో 4 ఎకరాల 17 సెంట్లు పొలం ఉందని ఈపొలాన్ని కొలతలు వేయించాలని 2021లో కొలతల కొరకు ఆన్లైన్ చేయించి ఇచ్చిన ఇంతవరకు రెవెన్యూ అధికారులు గతంలో పనిచేసిన విఆర్ఓ ప్రస్తుత విఆర్ఓ సర్వేయర్ ఎవరు కూడా పలకడం లేదని ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో నేను ఏజెంట్ గా ఉన్నానని మీగెలుపు కోసం నేను కష్టపడ్డానని అంతేకాకుండా ఎన్నికల సమయంలో నాపై బైండోవర్ కేసు కూడా నమోదు అయిందని కానీ నేను సిద్ధార్థ రెడ్డి వర్గం అని చెప్పేసి మాపొలాన్ని కొలతలు వేయించకుండా అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యేకు ఆయన తెలియజేశారు.వెంటనే ఎమ్మెల్యే తహసిల్దారు సర్వేయర్ విఆర్ఓ తో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని సచివాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమయపాలన పాటిస్తూ ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే అన్నారు.ఈకార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు రఘురామయ్య,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,ఎంపీడీవో జీఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఈఓఆర్డి ఫక్రుద్దీన్ తదితర వివిధ శాఖల మండల అధికారులు వివిధ గ్రామాల నాయకులు సాదిక్ వెంకట్ ఇనాయతుల్ల,షరీఫ్ పుల్లయ్య మహేష్ సీతారాముడు,కాల రమేష్,దామగట్ల అనిల్, పంచాయతీ కార్యదర్శులు హసీనా, విజయకుమారి,రఘు తదితరులు పాల్గొన్నారు.