NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తండ్రిని బ్రతికించుకోవడం కోసం తనయుడు పోరాటం

1 min read

– అంత్య క్రియల ప్రార్థనలలో పాల్గొని ఆర్థిక సహాయం చేసిన సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : అనారోగ్యం కు గురైన తన తండ్రీని బ్రతికించు కోవడం కోసం కమలాపురం టీ వి 9 రిపోర్టర్ సురేష్ చాలా కష్ట పడ్డాడని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకుడు తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ సురేష్ సేవలను కొనియాడారు. సోమవారం కర్నూల్ హాస్పిటల్ లో మృతి చెందిన సురేష్ తండ్రి రత్నమయ్య మృత దేహానికి మంగళ వారం ఉదయం సాయినాథ్ శర్మ పూలమాల వేసి ఘనంగా నివాళలర్పించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి ని బ్రతికించు కోవడానికి చివరివరకు సురేష్ పోరాటం చేసాడన్నారు ఒకవైపు జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూ మరో వైపు తండ్రీ ఆరోగ్యం గురించి ఆందోళన, చెందే వాడన్నారు ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నప్పటికి తండ్రి ఆరోగ్యం కాపాడుకోవడం కొసం సురేష్ తన తండ్రి చివరి శ్వాస చివరి వరకు శ్రమించాడని కొనియాడారు.. ఈ సందర్భంగా సురేష్ తండ్రి రత్నమయ్య అంత్య క్రియల ఖర్చులకు 10 వేల ఆర్థిక సహాయం సాయినాథ్ శర్మ అందించారు.

About Author