PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష కు విశేష  స్పందన

1 min read

– కార్యక్రమాన్ని ప్రారంభించిన టిటిడి బోర్డు మెంబర్ మాసీమ బాబు,సీకేదీన్నే జడ్పీటీసీ నరేన్ రామాంజనేయులరెడ్డి

– 500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని టీటీడీ బోర్డు మెంబర్ మాసీమ బాబు సి కె దీన్నే జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డిలు అన్నారు, సోమవారం వారు మండలంలోని గుర్రం పాడు గ్రామపంచాయతీలోని ఓబులం పల్లె  సర్పంచ్  చల్లా ప్రమీల  ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు, గుర్రంపాడు గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడం, వీరికి డాక్టర్ బి చెన్నారెడ్డి నేతృత్వంలో డాక్టర్ల బృందం  వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు, అంతేకాకుండా ముగ్గురికి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు అందించేందుకు ఇతర ఆసుపత్రులకు పంపించడం జరిగింది అన్నారు, అలాగే 32 మంది కి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారుమూల ప్రాంతాల లో నివసించే ప్రజలకు కూడా వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు, సామాన్య ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్య పరీక్షలు నిర్వహించుకో లేరని అలాంటి వారి కొరకు ఇలాంటి కార్యక్రమాలుఎంతోఉపయోగపడతాయని వారు తెలియజేశారు, గతంలో ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు, నడవలేని వారికి, చూపు లేని వారికి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గొప్ప ఊరట ను ఇవ్వడం జరిగిందన్నారు, ప్రజలు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు, అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పౌష్టికాహారస్థాళ్లను ఆయన పరిశీలించి వారిని అభినందించారు, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో చల్లా వెంకటసుబ్బారెడ్డి, చల్లా అన్వేష్ రెడ్డి, చల్ల శివారెడ్డి, చంద్రఓబుల రెడ్డి, మండల ప్రత్యేక అధికా సిహెచ్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, కడప కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ యస్ ఆర్ ,ఎంపీటీసీలు , నిరంజన్ రెడ్డి, రఘురాం రెడ్డి, అధికారులు తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్,  ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఏపిఎం గంగాధర్, కార్యదర్శి , సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author