NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు ఘన ఆహ్వానం

1 min read

వందవాగిలి, గజ్జహళ్లి గ్రామాల్లో దళిత నాయకులకు ఆహ్వానం – పూర్తి మద్దతు ప్రకటించిన నాయకులు

హోళగుందన్యూస్ నేడు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా  ఎంఆర్పీఎస్​ ఎంఎస్​పి  మరియు దళిత నాయకుల ఆధ్వర్యంలో హొళగుంద మండల కేంద్రంలో నిర్వహించబోయే జయంతి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు వందవాగిలి మరియు గజ్జహళ్లి గ్రామాల్లో ఉన్న దళిత నాయకులను ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా గ్రామాల నాయకులు కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, సమానత్వం మరియు సామాజిక న్యాయం సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సంకల్పించారు.అలాగే జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యామని నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.డా. అంబేద్కర్  బాటలో నడుస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *