NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాతా శిశు అభివృద్ధికి పౌష్టికాహారం అవసరం..

1 min read

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ .. భాగ్యలక్ష్మి

పౌష్టికాహారం గురించి వివరిస్తున్న సిహెచ్ఓ భాగ్యలక్ష్మి

చాగలమర్రి, న్యూస్​ నేడు: మాతా శిశు సంరక్షణ, వారి అభివృద్ధికి పౌష్టిక ఆహారం తప్పక అవసరమని మల్లె వేముల గ్రామం హెల్త్ క్లినిక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మండల సూపర్వైజర్ సుశీల ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నపిల్లలకు మొబైల్ దూరంగా ఉంచాలన్నారు. పిల్లల మానసిక శారీరక పరిపక్వత కోసం చెడు ప్రభావం చూపే వాటిని దూరంగా ఉంచాలన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టిక ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. జంక్ ఫుడ్స్ కు బదులుగా శనగలు, పప్పులు, వేరుశెనగ విత్తనాలు, చిరుధాన్యాల పాప్ కార్న్, పండ్లు వినియోగించాలన్నారు. వ్యాధి నిరోధక శక్తి కొరకు కావాల్సిన వాటిని పిల్లలకు అందించాలన్నారు. ఇంకా బయట, ఆడుకునేందుకు అవకాశం ఇస్తే మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందుతారన్నారు. ఎక్కువ సమయాన్ని చిన్న పిల్లలతో గడిపితే వారి మానసిక పరిపక్వత పెంపొందించబడుతుంది అన్నారు. గర్భవతులు బాలింతలు, చంటి బిడ్డ తల్లులు ఆరోగ్య కార్యకర్తలు అందించే టీకాలను తప్పకుండా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు బాలింతలు, పూర్వ ప్రాథమిక విద్యార్థులు, చిన్నారులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author