PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజీనామా ఆమోదించండి… స్పీక‌ర్ కు లేఖ రాసిన‌ గంటా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసన సభ్యత్వానికి గంటా రాజీనామా చేశారు. అయితే ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆవేదన చెందుతున్నట్లు లేఖలో గంటా పేర్కొన్నారు. ఏడాదికాలంగా పోరాడుతున్న నిర్వాసితులు, కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధ కలిగించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని లేఖలో గంటా రాసుకొచ్చారు.

                                           

About Author