భారతీయ సనాతన కాలమానం ప్రకారం నూతన సం. ఉగాది నే
1 min read– కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాణుమాలయన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతీయ సనాతన కాలమానం ప్రకారం నూతన సంవత్సరం అంటే ” ఉగాది ” మాత్రమే అనీ…జనవరి 1 కాదనీ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం,శ్రీ జి. పుల్లారెడ్డి భవన్,భరతమాత మందిర ప్రాంగణం,రెవెన్యూ కాలనీ, లో నిన్న ,ఈరోజు జరిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాణుమాలయన్ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ ముద్రించిన (కాలమానం) ఉగాది నుండి ఉగాది వరకు ఉన్న హిందూక్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం ఇలా అన్నారు, ఇంకా మాట్లాడుతూ…ఆంగ్ల కాలమానం లో తేదీ మాత్రమే మారుతుందని కానీ భారతీయ కాలమానంలో తిథి,వారి,నక్షత్ర,యోగ,కరణాలు ఉంటాయనీ వీటినే పంచాంగాలు అంటారనీ ఆయా రోజుల్లో వచ్చే పండుగలను ,పర్వదినాలను,ఖచ్చితంగా లెక్కించే అధ్భుతమైన విధానం మన ఋషి మునులు మనకు అందజేశారనీ సం.లోని మొదటి నెల అనగా చైత్రమాసం లో మొదటి రోజైన శుధ్ధ పాడ్యమి రోజునే యుగారంభం అయిందనీ అందుకే యుగానికి మొదటి రోజు కాబట్టి “యుగాది” అయ్యిందనీ కాలక్రమేణా అది ఉగాది అయ్యిందనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకట్రామయ్య , సంఘటనా కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి,కార్యదర్శి కాకర్ల రాముడు,సహకార్యదర్శి ప్రాణేష్, కోషాధికారి సందడి మహేష్,బజరంగ్ దళ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి ఇతర రాష్ట్ర,విభాగ్ కార్యకర్తలు పాల్గొన్నారు.