PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షరతులు లేకుండా… అక్రిడిటేషన్లు ఇవ్వాలి

1 min read

– ‘ ఆర్​ఎన్​ఐ’ పత్రికలకు ఆన్​లైన్​లో అప్​లోడ్​కు అవకాశమివ్వాలి

-‘ నేజు’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి

పల్లెవెలుగు: రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా,న్యూఢిల్లీ వద్ద రిజిష్టర్ కాబడిన పత్రికలన్నిటికి ఎలాంటి షరతులు లేకుండా అక్రిడేషన్ లు మంజూరు చేయాలని ‘నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్’రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలులో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక పత్రికలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని,ఒకవైపు  రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న న్యూస్ ప్రింట్ ధరలు, మరో వైపు ట్రాన్స్ పోర్ట్, ప్రింటింగ్ ధరలు పెరిగి పోతుండటంతో స్థానిక పత్రికలు కోలుకోలేక పోతున్నాయి. కోవిడ్ మహమ్మారితో పెద్ద పత్రికలు సైతం తమ పత్రికల పేజీలు తగ్గించుకోవడం తో పాటు జిల్లా టాబ్లాయిడ్ ను రద్దు చేసుకున్నాయి. స్థానిక పత్రికలు దాదాపు 50శాతం మూత పడగా, కొన్ని పత్రికలు ,ఈపేపర్ తోనే సరిపుచ్చుకుంటున్నాయి. స్థానిక పత్రికలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లభించక పోతుండడంతో అవి కుదేలవుతున్నాయి. పత్రికలు రెగ్యులారిటీ పేరున సవ లక్ష  ఆంక్షలు విధిస్తూ జర్నలిస్టుల కనీసం హక్కు అయినటువంటి అక్రిడిటేషన్ల లో కూడా ప్రభుత్వం భారీ కోత విధించి స్థానిక పత్రికలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో స్థానిక పత్రికలు తమ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్థానిక పత్రికల యాజమాన్యాలు తమ హక్కుల సాధన కొరకు అందరు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ఇటివల తీసుకొని వచ్చిన జీ .ఓ 38 అస్తవ్యస్తం గా ఉందని, స్థానిక పత్రికలకు కేవలం రెండు అక్రిడేషన్లు మంజూరు ఇచ్చేవిధంగా జీ.ఓ తీసుకొచ్చారని, పీరియాడికల్స్ కు కేవలం ఒక్క అక్రిడేషన్ మాత్రమే ఇచ్చేందుకు జీ.ఓ సవరించడం దుర్మార్గ చర్య అన్నారు. రెగ్యులర్ గా ప్రచురింప బడుతున్న  స్థానిక పత్రికలకు జిల్లా కేంద్రంలో 4 అక్రిడిటేషన్లు,ప్రతి నియోజక వర్గానికి ఒక అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా పీరియాడికల్స్ కు 3 అక్రిడిటేషన్లు మంజూరు చేయాలన్నారు. అడపా దడపా ప్రచురితం అవుతున్న పత్రికలకు రెగ్యులారిటీతో సంబంధం లేకుండా ప్రతి పత్రికకు ఒక అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు.

‘ఆర్​ఎన్​ఐ’ పత్రికలకు…ఆన్​లైన్​లో అవకాశమివ్వాలి:

అలాగే ఢిల్లీ లో రిజిస్టర్ కాబడిన ప్రతి స్థానిక పత్రిక అక్రిడేషన్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా రాష్ట్రం లోని అన్ని జిల్లాల ఉప సంచాలకులను ఆదేశించాలని ఇవ్వాలని కమిషనర్ ను కోరారు. అలాగే కొత్త జిల్లాలను ఆర్.ఎన్.ఐ.న్యూఢిల్లీ వారు ఇంకా గుర్తించని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ల మంజూరుకు మరో ఐదేళ్ళపాటు ఉమ్మడి జిల్లాలుగానే పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.అక్రిడిటేషన్ ల కొరకు దరఖాస్తు గడువు ఈ నెల 31వరకు పొడిగించాలని కోరారు.

About Author