NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు కత్తి స్వాధీనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు, కర్నూలు డీఎస్పీ  K.V. రాఘవేంద్ర  ఆధ్వర్యంలో హత్యాయత్నం కేసులో ముద్దాయి ఫయాజ్ బాష @ ఫయాజ్ (29 సం.), తండ్రి: అమీన్ బాష, ఇంటి నెం. 36-46-110, చిత్తారి వీధి, కర్నూలు టౌన్‌ను అరెస్టు చేశారు.కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తారి వీధిలో ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద 17.08.2026 అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఫయాజ్ బాష, షేక్ షఫీపై చంపాలనే ఉద్దేశంతో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో షేక్ షఫీ తలకు బలమైన రక్తగాయం, చేతికి రక్తగాయాలు అయ్యాయి. షేక్ ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.83/2026 U/s 109(1), 79, 351(2) BNS కింద 17.08.2026న కేసు నమోదు చేశారు.ముద్దాయి కోసం కర్నూలు 1 టౌన్ సీఐ శ్రీ జి. మారుతి శంకర్, ఎస్‌ఐ శ్రీ పి. మహమ్మద్ అలీ ఖాన్ మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.రాబడిన సమాచారం మేరకు 18.08.2026 సాయంత్రం 6 గంటల సమయంలో కర్నూలు టౌన్ పరిధిలోని కల్లూరు దర్వాజా హంద్రీ బ్రిడ్జి వద్ద ముద్దాయి ఫయాజ్ బాష @ ఫయాజ్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నేరానికి ఉపయోగించిన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.కేసును సత్వరం ఛేదించిన కర్నూలు డీఎస్పీ శ్రీ K.V. రాఘవేంద్ర, కర్నూలు 1 టౌన్ సీఐ శ్రీ జి. మారుతి శంకర్, ఎస్‌ఐ శ్రీ పి. మహమ్మద్ అలీ ఖాన్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *