అత్యవసర సమయంలో అరుదైన ఎయిర్‌వే ప్రక్రియతో యువకుడికి పునర్జన్మ
1 min read
– కిమ్స్ సవీరలో అరుదైన చికిత్స
– రాయలసీమలో తొలిసారిగా అత్యవసర రిజిడ్ బ్రాంకోస్కోపీ, వై-స్టెంట్ అమరిక
– ఈ ప్రాంతంలో రిజిడ్ బ్రాంకోస్కోపీ సదుపాయం ఉన్న ఏకైక కేంద్రం కిమ్స్ సవీర
అనంతపురం, న్యూస్ నేడు : తీవ్ర శ్వాసకోశ సమస్యతో అపస్మారక స్థితిలో ఆసుపత్రికి వచ్చిన 22 ఏళ్ల యువకుడికి కిమ్స్ సవీర వైద్యులు అరుదైన అత్యవసర ఎయిర్‌వే ప్రక్రియ నిర్వహించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చికిత్సనందించిన కన్సల్టెంట్ – క్లినికల్, అడ్వాన్స్‌డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ & అలర్జీ స్పెషలిస్ట్ డా. యశో వర్ధన్ మంగిశెట్టి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడికి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందితో అత్యవసర విభాగానికి తీసుకురాగా, అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వెంటిలేటర్‌పై ఉంచారు. కణితి శ్వాసనాళంలో పెరగడం లేదా బయట నుంచి శ్వాసనాళంపై ఒత్తిడి కలిగించడం వల్ల సెంట్రల్ ఎయిర్‌వే ఆబ్స్ట్రక్షన్ ఏర్పడుతుంది. శ్వాసనాళం తీవ్రంగా మూసుకుపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, శ్వాసకోశ వైఫల్యం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.రాయలసీమలో తొలిసారిగా ఈ చికిత్స రాయలసీమ ప్రాంతానికి వైద్యపరంగా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. రాయలసీమలో రిజిడ్ బ్రాంకోస్కోపీ నిర్వహించేందుకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు ఉన్న ఏకైక కేంద్రం కిమ్స్ సవీర హాస్పిటల్ అని పేర్కొన్నారు. ఈ తరహా అత్యవసర ఎయిర్‌వే ఇంటర్వెన్షన్ రాయలసీమలో తొలిసారిగా నిర్వహించినట్లు తెలిపారు. తీవ్రమైన శ్వాసకోశ అత్యవసర పరిస్థితుల్లో రోగులను దూర ప్రాంతాల్లోని పెద్ద నగరాలకు తరలించాల్సిన అవసరం లేకుండా, అనంతపురంలోనే ఆధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉండటం ఎంతో కీలకమని వైద్యులు పేర్కొన్నారు.


