PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరు హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

1 min read

– విద్యార్థులకు ఏదైనా హాని జరిగితే ఎవరిది బాధ్యత
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్లో ఆదివారం నాడు సెలవు దినం రోజున హాస్టల్లో వార్డెన్ రవికుమార్ లేకపోవడం దుస్సాహాసమైన చర్య అని పిడిఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.మర్రి స్వామి అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం రోజున ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాస్టల్లోనే ఫుల్ డే ఉండి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి ఇలాంటి నిబంధనలను వార్డెన్ అస్సలు పట్టించుకోరు హాస్టల్లో ఎప్పుడూ ఉంటారో ఎప్పుడూ ఉండరు కూడా తెలియదు వెళ్లిన ప్రతిసారి అక్కడ హాస్టల్లో కనిపించరు.రోజు రాత్రి బస చేసే నిబంధన ఉన్నప్పటికీ వారానికి ఒకటి రెండు రోజులు కూడా బస చేసే పరిస్థితి లేదు వీటి పైన పై అధికారులు పర్యవేక్షణ నిర్వహించి వార్డెన్ పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.అలాగే విద్యార్థులకి ఏదైనా జరగడానికి జరిగితే విష పురుగులు మొదలగునవి ఏదైనా జరిగినప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండి వారిని సంరక్షించుకునే బాధ్యత వార్డెన్ పైన ఎంతైనా ఉందన్నారు అలాంటిది వార్డెన్ లేరు వారిని సంరక్షించేది ఇంకెవరు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఆయనపై చర్యలు తీసుకొని విద్యార్థులకు,హాస్టల్ కు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు డివిజన్ సహాయ కార్యదర్శులు బిట్టు,అరవింద్,మహబూబ్ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author