పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
1 min read
ఎమ్మిగనూరు మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న దుకాణాలపై విచారణ చేపట్టి, లైసెన్సును రద్దు చేయాలి
ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు మండలంలో పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అలానే మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీ దాడులు చేసి వారి లైసెన్సులను రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న డిమాండ్ చేశారు. సోమవారం నాడు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో చాలా ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ కంపెనీ దుకాణాలు పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం సిఫారసు చేసిన విత్తనాలు మాత్రమే అమ్మాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి నకిలీ విత్తనాలను పట్టణంలో యదేచ్ఛగా కొందరు దుకాణాల్లో అమ్ముతున్నారని ఆరోపించారు. మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో కూడా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని తెలిపారు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు పట్టణ మరియు మండల పరిధిలోని అన్ని దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించాలన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ,వారి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు పెద్దారెడ్డి, మల్లికార్జున ,నరసింహులు, రాముడు ,జయరాం ,ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు బాలరాజు, బాబు,వీరంజినేయులు ,రైతులు పాల్గొన్నారు.