పార్టీ విధానాలకు విరుద్ధంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకోవాలి…
1 min read
న్యూస్ నేడు హొళగుంద: అధిష్టానాన్ని కోరిన మండల తెదేపా నాయకులు… తెదేపా పార్టీ విధానాలకు విరుద్ధంగా పనిచేసే నాయకులపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు కోరారు.ఇటీవల కొంతమంది తెదేపా నాయకులు మండల కన్వీనర్ పదవి ఆశిస్తున్నారు.కానీ వైసిపి,ఇతర పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పదవి డిమాండ్ చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, సీనియర్ నాయకులు అబ్దుల్ సుభాన్,మురళి,జాకీర్,వీరన్న గౌడ్,బసవ,సిబిఎన్ ఆర్మీ మోయిన్ తదితరులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధిష్టానం నుంచి హోలగుంద మండల కన్వీనర్ మార్పు గురించి ఎలాంటి సంకేతాలు రాక ముందే పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వైసీపీ పార్టీ,ఇతర పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం సమంజసం కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు అడిగే హక్కు ఉంది, తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పత్రికా ప్రకటనలు చేయాలి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వదిలేసి తెలుగుదేశం పార్టీ ఓటమి కోసం పనిచేసిన పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నియమ నిబద్ధత గల పార్టీ అని, పార్టీ విధానాలకు విరుద్ధంగా పనిచేయడం పార్టీకి ద్రోహం చేసినట్టే అని ఎద్దేవ చేశారు. ఇలా పార్టీ విధానాలను అనుసరించకుండా పార్టీకి విరుద్ధంగా పనిచేసే వారిపై నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు బుడగజంగాల రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్,సుబాన్,ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.