NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్యకర్తలే నా బలం, బలగం, నా విజయం…

1 min read

కార్యకర్తల రుణం తీర్చుకోవడం నా ప్రథమ కర్తవ్యం…

నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నాను..

కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా 24 గంటలూ అందుబాటులో ఉంటా..

పార్టీకి నమ్మకద్రోహం చేసిన వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు…

ఆలూరు నియోజకవర్గ  మహానాడులో ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద గౌడ్  వ్యాఖ్య

ఆలూరు, న్యూస్ నేడు  :  ఆలూరు పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జి  వీరభద్ర గౌడ్  ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలూరు నియోజకవర్గ మహానాడు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు గారు &ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ వీరభద్ర గౌడ్  పాల్గొన్నారు.. కార్యక్రమంలో భాగంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు  చిత్ర పట్టణానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా వీరభద్ర గౌడ్  మాట్లాడుతూతెలుగుదేశంపార్టీ కార్యకర్తలు నాకు యజమానులు….నేను వారి సేవకుడిని. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం . కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు 24గంటలూ అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా నేను వారికి అండగా నిలబడతాను. పార్టీకి విధేయత కలిగి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఇప్పించడం నా బాధ్యత. పార్టీకి బలం కార్యకర్త . ఈ దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కోటి మంది కార్యకర్తలు టీడీపీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిజాయితీగా అర్హత ఉన్న అందరికీ అందిస్తాం, పార్టీకి ద్రోహం చేసిన వారికి తప్ప. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరులు కూడా నాకు ఓటు వేసే విధంగా నీతి, నిజాయితీతో పనిచేస్తాను. మా నాయకుడు వీరభద్ర గౌడ్ అని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని చెప్పగలిగే విధంగా నా పనితీరును మెరుగుపరచుకుంటాను.

2024కు ముందు…ఆ తర్వాత అనేలా  నియోజకవర్గం అభివృద్ధి : ఆలూరు నియోజకవర్గాన్ని గత పాలకులు పూర్తిగా విస్మరించారు . ఎమ్మెల్యేలుగా  పనిచేసి ప్రజలను, నియోజకవర్గాన్ని దోచుకున్నారే తప్ప చేసిన మేలు ఏమీ లేదు. గత 50ఏళ్లుగా ఆలూరు నియోజకవర్గంలో సరైన అభివృద్ధి లేదు…… రానున్న నాలుగేళ్లలో ఆలూరు నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా . దీనికోసం ఎంతైనా కష్టపడతాను. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిజాయితీగా అందించి నేనేంటో నిరూపిస్తా. ఆలూరు నియోజకవర్గం 2024కు ముందు…. ఆ తర్వాత అనేలా చేయడం కోసం పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో పనిచేస్తున్నాను.  నియోజకవర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేయడమే కర్తవ్యంగా పనిచేస్తున్నాను.ఆలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు . వాటిని ఆధారంగా చేసుకుని వైసీపీ విషపుత్రిక సాక్షి తప్పుడు కథనాలను రాస్తోంది. గత పాలకుల మాదిరి మేం ప్రజలను లంచాల కోసం, కమీషన్ల కోసం పీడించడం లేదనే విషయాన్ని సాక్షి మీడియా తెలుసుకోవాలి. నీతి, నిజాయితీతో ప్రజలకు సేవలు అందిస్తున్నాం. గత పాలకులు పేదవారికి ఇచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కులలో కూడా కక్కుర్తిపడిన విషయాలను సాక్షి పత్రికలో రాసే దమ్ముందా? కానీ మేం వైసీపీ పాలకుల మాదిరి కక్కుర్తి పనులు చేయడం లేదు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తున్నాం. సాక్షి పత్రిక ఎన్ని తప్పుడు వార్తలు రాసినా….మేం ఎక్కడా నీతి, నిజాయితీని తప్పకుండా ప్రజలు మెచ్చేలా, ప్రజలకు నచ్చేలా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అందిస్తాం.

పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారు తప్పించుకోలేరు :తెలుగుదేశంపార్టీ కార్యకర్తలం అని చెప్పుకుంటూనే పార్టీకి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గులను ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలను గౌరవించి, వాటికి కట్టుబడి పనిచేసేవారి కోసం వారికి ఏ సమస్య వచ్చినా నేను వారికి అండగా నిలబడతాను. పార్టీకి ద్రోహం చేసిన వారిని పార్టీ పెద్దల ముందు, పార్టీ కార్యకర్తల ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాం. పార్టీ అంటే అందరికీ అమ్మలాంటిది. అలాంటి అమ్మకే ద్రోహం చేస్తే ఎలాంటి వారైనా, ఎంతటివారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని హెచ్చరిస్తున్నాం అని  వీరభద్ర గౌడ్  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ఆలూరు నియోజకవర్గం లోని 6 మండలాల కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ  నాయకులు,కార్యకర్తలు,  సర్పంచులు వార్డు నంబర్లు బూత్, క్లౕచర్, యూనిట్, ఇన్చార్యులు మాజీ ఎంపిటిసి,మాజీ జెడ్పిటిసి, టిడిపి, నాయకులు,కార్యకర్తలు, తెలుగు యువత టియన్ఎస్​ఎఫ్​ ,బివిజి టీమ్​  ఆరు మండలాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *