బాలకృష్ణను మూర్ఖుడు అనడంతో రగిలిపోయిన కార్యకర్తలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : హిందూపురాన్ని జిల్లాకేంద్రంగా ప్రకటించకపోవడానికి ముగ్గురు మూర్ఖులే కారణమని బీసీ సంఘం నేత కురుబ చలపతి అన్నారు. అందులో మొదటి వ్యక్తి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అనీ, రెండో వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనీ, మూడోవ్యక్తి ఎంపీ గోరంట్ల మాధవ్ అని మండిపడ్డారు. బాలకృష్ణను మూర్ఖుడనడంతో అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా రగిలిపోయారు. చలపతి వైపు తెలుగు తమ్ముళ్లు దూసుకుపోయారు. బాలకృష్ణను మూర్ఖుడనడం తప్పనీ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.