కోలుకుంటున్న కైకాల సత్యనారాయణ
1 min read
పల్లెవెలుగు వెబ్: అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలనాటి నటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై ఆయన కుమార్తె రమాదేవి స్పందించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. అందరితో మాట్లాడుతున్నారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, కైకాల సత్యనారాయణ హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.