డ్రగ్స్ డెన్ గా ఆప్ఘనిస్థాన్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించేశారు. పంజ్ షేర్ ప్రావిన్సు మినహా ఆప్ఘన్ మొత్తం తాలిబన్ల వశమైంది. తాలిబన్ల షరియా చట్టం అమలుతో క్రూరమైన పాలన మొదలైంది. ఆప్ఘన్ లో మానవ హక్కులు, మహిళా హక్కులు హరించుకుపోయాయి. ఆప్ఘనిస్థాన్ ఇక నుంచి నల్లమందు కర్మాగారంగా మారబోతోందంటూ ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్ ఓడిసి ఆందోళ వ్యక్తం చేస్తోంది. నల్లమందు తయారీకి, డ్రగ్స్ ఉత్పత్తి.. రవాణకు ప్రధాన కేంద్రంగా ఆప్ఘన్ మారబోతుందని ఐరాస సంస్థ చెబుతోంది. ప్రపంచంలోని నల్లమందు, హెరాయిన్ ఉత్పత్తిలో 80 నుంచి 90 శాతం ఆప్ఘన్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఆఫ్ఘన్ లో 2,50,000 హెక్టార్లు నల్లమందు సాగు విస్తీర్ణం ఉంది. ప్రపంచం మొత్తం మూడు లక్షల హెక్టార్లలో నల్లమందు సాగు అవుతుంటే.. ఒక్క ఆఫ్గన్ లోనే మూడొంతులు పైగా సాగు అవుతోంది. మెథాం పెటమిన్ అనే మత్తుమందు తయారీకి అవసరమయ్యే ముడిసరుకు ఆప్ఘన్ లోని ఎఫ్రెడా మొక్కల నుంచి లభిస్తోంది. ఇక నుంచి తాలిబన్ల పాలన సాగునుండటంతో నల్లమందు, హెరాయిన్, మెథాం పెటమిన్ తయారీకి అడ్డూ అదుపూ ఉండదు. ఈ రసాయనాలు తయారీ, శుద్ధి .. రవాణ చేసే వ్యాపారుల నుంచి తాలిబన్లు పన్నులు వసూలు చేస్తారు. దీంతో నల్ల మందు వ్యాపారం ఇక నుంచి విచ్చలవిడిగా సాగుతుందని యూఎన్ఓడిసి ఆందోళన వ్యక్తం చేస్తోంది. నల్లమందు తయారీని సాగనివ్వమని తాలిబన్లు చెప్పినప్పటికీ వారి మాటలు నీటి మీద రాతలేనని ఇప్పటికే పలుమార్లు వెల్లడైంది.