మహిళల వివాహ వయసు.. పురుషులంతా కలిసి నిర్ణయించారు !
1 min readపల్లెవెలుగువెబ్ : కనీస వివాహ వయసు పెంపు పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. మహిళల కనీస వివాహ వయసు పురుష ఎంపీలంతా కలిసి నిర్ణయించారని అన్నారు. దీనికి సంబంధించి నియమించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది ఎంపీల్లో 30 మంది ఎంపీలు పురుషులేనని, మహిళ ఒక్కరంటే ఒక్కరే ఉన్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ మహిళల భవిష్యత్‌ను నిర్ణయించే ఈ కమిటీలో మహిళా ఎంపీలను పెంచాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు.