బ్యాంకుల ప్రైవేటీకరణ పై ముందుకే !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ త్వరితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అడ్డంకిగా ఉన్న 1949 నాటి బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణ చేయబోతోంది. ఈ చట్టం ప్రకారం పీఎస్‌బీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 20 శాతం మించి ఉండకూడదు. దీన్ని అధిగమించే సవరణ బిల్లు ప్రతిపాదనను అధికార వర్గాలు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపనున్నాయి. నిజానికి రెండు పీఎస్‌బీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి కావాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మార్కెట్ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ విషయంలో వెనుకంజ వేసింది.