అలర్ట్.. నెల రోజుల్లో థర్డ్ వేవ్ రావొచ్చు ..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన మూడో దశ నెల రోజుల్లో మొదలు కావొచ్చన్న అంచనాలో వైద్య నిపుణులు ఉన్నారు. లాక్ డౌన్ సడలింపుల కారణంగా ప్రజలు విపరీతంగా రోడ్ల మీదకు వస్తున్న తరుణంలో డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థర్డ్ వేవ్ మొదలైతే ఒక్క మహారాష్ట్రలోనే కేసుల సంఖ్య పెద్దల్లో 8 లక్షలు, పిల్లల్లో బాధితుల్లో 10 శాతం వరకు కేసులు ఉండే అవకాశం ఉందని మహారాష్ట్ర వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ను గుర్తించినట్టు సమాచారం ఉంది.
– డెల్టా వేరియంట్ మ్యుటేషన్లు చెంది డెల్టా ప్లస్ వేరియంట్ గా రూపాంతరం చెందుతుంది. ఈ వైరస్ లో స్పైక్ ప్రోటీన్లు రూపాంతరం చెంది అంతు చిక్కకుండా శరీరం లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడుతాయి. ఈ స్పైక్ ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని కరోన వ్యాక్సిన్ ను రూపొందించారు. కానీ వ్యాక్సిన్ ఏ మేరకు ఈ స్పైక్ ప్రోటీన్లలో మార్పును ఎదుర్కొనగలదు అన్న సందేహాలు ఉన్నాయి. మోనో క్లోనల్ యాంటీబాడీస్ మందు ప్రభావం నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ తప్పించుకున్నట్టు ఇటీవల పరిశోధనల్లో గుర్తించారు.