జగన్ తో అలీ భేటీ.. రాజ్యసభ సీటు అంటూ ప్రచారం
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ కమెడియన్ అలీ భేటీ అయ్యారు. అలీకి త్వరలోనే రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా సమావేశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ విషయమై అలీని ప్రశ్నించగా తనతో అలాంటివేమీ మాట్లాడలేదని, ఫార్మాలిటీ కోసం పిలిచిరాని, తొందరలోనే మళ్లీ కలుస్తానని అన్నారు. తాను పదవుల కోసం వైసీపీలోకి రాలేదని అన్న ఆయన.. గత ఎన్నికల్లోనే తనకు ఆఫర్ వచ్చిదని, అయితే తనకు అప్పట్లో అంత సమయం లేకపోవడంతో పోటీ చేయలేదని అన్నారు.