ఆలూరులో వైఎస్సార్సీపీ శంఖారావం
1 min read
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలి.. కార్యకర్తలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సూచించారు.ఆలూరు మండల కేంద్రంలోని ఉమా కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన మండలస్థాయి పార్టీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతూ గ్రామస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని సూచించారు.ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తాను, పార్టీ అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలని, ఎన్నికల కార్యాచరణ పక్కా ప్రణాళికతో రూపొందించుకోవాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని పేర్కొన్నారు. పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.గ్రామస్థాయి నుంచి నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి పంచాయతీలో సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులను సమీకరిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై స్పందించడం ద్వారా పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో ఆలూరు మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.



