NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

1 min read

– ముస్తాబవుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయాలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని శనివారం చెన్నూరు లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి( కోట్ల స్వామి) చెన్నూరు సరస్వతి కాలనీలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను రంగులతో తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. చెన్నూరు కోట్ల స్వామి ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారికి వేద పండితుల చేతుల మీదుగా పంచామృత అభిషేకం ప్రత్యేక పూల అలంకరణ పుష్పార్చన నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు భక్తుల దర్శనం ఏర్పాటు చేశారు. భక్త బృందం చే గోవింద నామాలు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవం నిర్వహించనున్నారు. అలాగే చెన్నూరు సరస్వతి కాలనీలో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం. వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల విన్యాసాలు కోలాటాలు పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించనున్నారు.

About Author