మంత్రిపదవిపై..అన్ని ఊహాగానాలే! ఎమ్మెల్యే శిల్పా
1 min read
పల్లెవెలుగువెబ్, మహానంది: త్వరలో ఏపీలో మలివిత మంత్రి వర్గ విస్తరణ జరగబోతోన్ననేపథ్యంలో తకు మంత్రి పదవీ వస్తందన్న విషయంపై అన్ని ఊహాగానాలేనని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శనివారం కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆయన ఈమేర స్పందించారు. తనకు మంత్రి పదవి ఇవ్వొచ్చని కొంతకాలంగా పత్రికల్లో, సోషల్‌మీడియాల్లో విస్తృతంగా వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. పార్టీలో తనకంటే సీనియర్లు ఉన్నారని, తనకు మంత్రి పదవి వచ్చనా..? రాకపోయినా..? సంతోషమేనన్నారు. మంత్రి పదవులు ముఖ్యమంత్రి అభిష్ఠం మేరకే లభిస్తాయని, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పదవి రాకపోయినా.. తనకు ప్రజలే ముఖ్యమని, పార్టీ కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.