పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలిశారు.మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో 2021 వ సంవత్సరంలో మానస నవరత్నాలు పథకంలో భాగంగా ‘పేదలందరికీ ఇల్లు’అనే పథకం ద్వారా అప్పట్లో అర్హులైన వారికి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు.పాఠశాల ప్రాంగణంలో పిల్ల నిర్మాణాలు చేపట్టకూడదని అప్పట్లో కోర్టును గ్రామస్తులు ఆశ్రయించారు.ఇండ్ల నిర్మాణాలు చేపట్టకూడదని అప్పట్లోనే కోర్టు స్టే విధించినందున ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.కోర్టు స్టే విధించినందున గ్రామంలో వేరే భూమిని తీసుకొని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వమని ముఖ్యమంత్రి ఆదేశించారని మాగ్రామంలో ఇంట్లో లేక ఎంతో మంది నిరుపేదలు అవస్థలు పడుతున్నారని వారందరికీ తొలి తెగతిన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భరత్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.స్థలాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు.