NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పతాక ఆవిష్కరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఏర్పడి 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42 సంవత్సరం లో అడుగుపెట్టుతున్న సందర్భంగా అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ కె మనోహర రావు ఆదేశాలు సూచనలమేరకు ఈరోజు కర్నూలు దేవనగర్ లో రాష్ట్ర కార్యాలయం లో పతాక ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కల్లె చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా అయన మాట్లాడుతు గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పలు సేవా కార్యక్రమం లు చెప్పట్టడం జరిగింది అని, సమాఖ్య గతం లో చేసిన పోరాటం ఫలితం గా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది., ప్రస్తుతం కూడా నిరుపేద బ్రాహ్మణ సంక్షేమం కొరకు సమాఖ్య ఎల్లప్పుడూ పనిచేస్తుంది అని, కర్నూలు జిల్లా లో బ్రాహ్మణ లకు ఎటువంటి సమస్య లు వున్నా దేవనగర్ లోని సమాఖ్య కార్యాలయం లో సంప్రదించవలెనని తెలిపారు.ఈ కార్యక్రమం లో సమాఖ్య యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సుందరరామ శర్మ, ప్రచారా విభాగం కార్యదర్శి, శ్రీకాంత్,కార్యవర్గ సభ్యులు ఎస్​. దుర్గాప్రసాద్, బాల సత్యనారాయణ దుర్గా ప్రసాద్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Author