పూర్వ విద్యార్థుల సమ్మేళనం…
1 min read
మాధవరం లో 20 ఏళ్ల కు కలుసుకున్న విద్యార్థులు
నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ
గూరువులను ఘనంగా సన్మానించిన విద్యార్థులు
మంత్రాలయం, న్యూస్ నేడు : మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 తరగతి (2004-2005) చదివిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో అప్పటి చదువులు చెప్పిన గురువులు రిటైర్డ్ హెచ్ యం ముక్కరన్న, సి. బెలగల్ ఎంఈవో ఆదాంబాష, ఎమ్మిగనూరు బాలికల పాఠశాల హెచ్ఎం కృష్ణ మూర్తి, బనగానపల్లె టంగుటూరి హెచ్ ఎం పర్వీన్ బాను, ఉపాధ్యాయులు శ్రీదేవి, గోపాల్, అనురాధ, జయరాజు, భీమన్న,ప్రేమమ్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్, హెబ్సిభా, ఆర్ఎంపీ డాక్టర్ నర్సింహులు లకు ఘనంగా సన్మానించారు. అప్పటి గురువులు, విధ్యార్థులు అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తరగతి గదులను తమ స్థలాలను చూసి ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. గురువులకు మెమోంటో, శాలువ, పూలమాల, బహుమతులతో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2004-2005 పదవతరగతి బ్యాచ్ విధ్యార్థులు భీమిరెడ్డి, ప్రవీణ్ కుమార్, బసవరాజు, తిరుమల నాయుడు, మధుకుమార్, మౌనయ్య ఆచార్, ఎండి నర్సింహులు,అల్లే సురేష్, కృష్ణ, నరసప్ప, గుంటెప్ప, మంజునాథ్ ఆచార్, బిజే రాజు, రమ్యశ్రీ, వనిత, సంద్యరాణి, విజయలక్ష్మి, నరసమ్మ, భారతి, భీమేష్, రవి కుమార్, రమేష్, నరసన్న, నరసప్ప, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
