పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం..ఆదర్శనీయం
1 min read– ఎంపీపీ లాలం రమేష్.
– విద్యార్థులు ఇష్టపడి చదివితే దేనినైనా సాధించవచ్చు సర్పంచ్ వేల్పుల జైపాల్.
– ఎంబిబిఎస్, ఐఐటి ,త్రిబుల్ ఐటీ ఎన్ఐటి లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం.
– ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు లక్ష రూపాయల చెక్కుల అందజేత.
– పదిలో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సన్మానం.
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల పూర్వ విద్యార్థులు విద్యాభివృద్ధి విద్యార్థుల కోసం పాఠశాల మౌలిక వసతుల కోసం చేసిన సేవలు అభినందనీయం, ఆదర్శనీయమని వెలుగోడు ఎంపీపీ లాల రమేష్ పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాలైన సాధించవచ్చు అని వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్ విద్యార్థులకు సూచించారు. శనివారం నాడు వెలుగోడు జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి ప్రోత్సాహక అభినందన సభ నిర్వహించారు. మొదటగా స్వర్గస్తులైన విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ఉపాధ్యాయులకు ,పాఠశాలలో చదువుకున్న విద్యార్థులఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ హెగ్డే అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శివ శంకర్ రెడ్డి ,మాజీ ఎంపీపీ సీతా మహాలక్ష్మి ఎంపీపీ లాలం రమేష్, సర్పంచ్ వేల్పుల జయపాల్ గ్రామపంచాయతీ ఈవో హరిలీల లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అదే సమయంలో గురువులను, పెద్దలను ,తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సంఘం కోసం పాటుపడినప్పుడే ఆ జీవితానికి సార్థకత లభిస్తుంది అన్నారు. తదుపరి విద్య కోసం పాఠశాల మౌలిక వసతుల కోసం అహర్నిశలు పాటుపడే డాక్టర్ శివ శంకర్ రెడ్డి సీతామహాలక్షమ్మ లను పూర్వ విద్యార్థులు సంఘం నాయకులు సభ్యులు ఘనంగా సన్మానించారు ,మెడిసిన్ లో సీట్లు సాధించిన ఎం అమీన్ అహ్మద్, గేల్లె ఉష ,సునీల్ కుమార్ రెడ్డి ,ఆకుల సుధీర్, మొహమ్మద్ మాహిర ,కొండవత్ వసంత నాయక్, ప్రజ్వలేంద్ర రెడ్డి ,ఏ ఆఫ్రిద్, అరుణ్ యాదవ్ ,వై పద్మ సాయి నితీష ,మొహమ్మద్ అనీష్, తేజ దీపక్ రెడ్డి లతోపాటు ఎన్ఐఐటి సాధించిన సాయి హర్షవర్ధన్, పీజీ రేడియాలజిస్ట్ సీటు సాధించిన మౌన రెడ్డి ,ఎండి పియాటీక్ సీట్లు సాధించిన వి సతీష్ కుమార్ రెడ్డి లకు పూలమాలలు, శాలువలు మే మెంటోలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా 10 లో టాపర్లుగా నిలిచిన వెలుగోడు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఎన్ ప్రసాద్, బి మీనాక్షి ,ఎస్ కాజిమ్ హుస్సేన్, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఆఫీఫా తర్ హనుమ్ ,కస్తూరిబా పాఠశాల విద్యార్థి జెస్సికా, లిటిల్ ఏంజిల్స్ విద్యార్థి స్నేహలత రెడ్డి, డీపాల్ విద్యార్థిని టి అల్ వీర ఆఫ్నాన్ ,జి బి ఎం పాఠశాల విద్యార్థి సాయి కిరణ్ రెడ్డి, రేగడ గూడూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థి రమా తులసి, వేల్పనూరు జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులు దీపక్, స్పందన లల పూలమాలలు శాలువలు మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన సుబ్రహ్మణ్యంకి, నారాయణపురం ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొందిన ఎం రఫీక్ అహ్మద్, పారుమంచాల ప్రధానోపాధ్యాయునిగా ప్రమోషన్ పొందిన మక్బూల్ భాష మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందిన సుస్మిత రత్న వర్షిని ,ఆర్టీసీ బెస్ట్ అవార్డు పొందిన ఓసా అధ్యక్షుడు రామలింగారెడ్డికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన వేల్పనూరు ప్రధాన ఉపాధ్యాయులు రామలింగారెడ్డి నీ పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. వడ్ల రాజశేఖర్ గాజుల తేజస్విని, హుస్సేన్ భాష, చరణ్ తేజ నాయక్, హేమలత, నసీరుద్దీన్ అబ్దుల్ ఖాదర్, షేక్ ఖాజిమ్ హుస్సేన్ షేక్ లకు ఒకరికి 6000 రూపాయలు చొప్పున సయ్యద్ తన్వీర్ జాకిర, షేక్ రుక్సానా, తహసీమ్ లకు ఒక్కొక్కరికి 12,000 లను తెలుగు పండిట్ సుబ్బరాయుడు జ్ఞాపకార్థకంగా ఎన్ ప్రసాద్, బి మీనాక్షి ,కాజుమ్ హుస్సేన్ లకు 1500 రూపాయల చెక్కులను వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గర్ల్ టాపర్గా నిలిచిన బి మీనాక్షికి ఐదువేల చెక్కును దాతలు సహాయ సహకారాలతో అందించారు. ఈ కార్యక్రమంలో సంజీవ రాయ ప్రసాద్ పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రతి సంవత్సరం తన వంతు సహాయంగా 10 వేల రూపాయలు ప్రకటించారు. ఉపాధ్యాయులు అహ్మద్ హుస్సేన్ పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రతి సంవత్సరం 5000 రూపాయలుప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సన్మాన గ్రహీతల పేరెంట్స్, ముక్క మల్ల భాస్కర్ రెడ్డి, లిటిల్ ఏంజిల్స్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఇమ్మానియేల్, ఓసా నాయకులు జయరామిరెడ్డి , సుల్తాన్ మొహిద్దిన్ ,నసురుల్లా ఖాన్, నారాయణ, అతావుల్లా, శ్రీకాంత్రెడ్డి,కుద్రతుల్లా ,రమణారెడ్డి శ్రీరాములు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.