PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అల్వాల’ స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నిక.. వాయిదా..!

1 min read

పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల: గోనెగండ్ల మండలం పరిధిలోని అల్వాల గ్రామం లో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల( ఎస్సీ) నందు పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. గత నెల 22వ తేదీన జరిగిన పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ ఎన్నికల్లో 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ఒక్కో తరగతి కి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు చొప్పున కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించామని, 5వ తరగతి లో సభ్యుల ఎన్నిక, చైర్మన్ ఎన్నిక కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తేదీ బుధవారం జరిగే ఎన్నికల్లో పాల్గొనాలని తల్లిదండ్రులకు ముందే ఆహ్వానం పంపామని పాఠశాల హెచ్​ఎం అన్నారు.ఈ మేరకు ఎన్నికల్లో పాల్గొనేందుకు 5వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు 13 మంది హాజరుకావాల్సి ఉండగా 6 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించేందుకు 50శాతానికి గాను 46 శాతం మాత్రమే హాజరయ్యారు. కావున కోరం లేక పోవడం వల్ల ఎన్నికలు నిర్వహించలేక పోయామని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహణ వాయిదా వేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాఘవేంద్ర తెలిపారు.

About Author