అమరావతే ఏపీ రాజధాని… జాతీయ మహాసభల్లో తీర్మానం
1 min read
పల్లెవెలుగువెబ్: ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని సీపీఐ జాతీయ మహాసభల్లో తీర్మానం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, జాతీయ మహాసభల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్టచర్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూలంగా స్పందించి సత్వరమే నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు.