15 నెలలకే బడిబాట పట్టిన అంబానీ వారసుడు !
1 min readపల్లెవెలుగువెబ్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ బడి బాట పట్టాడు. ముంబైలోని ఒక ప్లే స్కూల్లో అడుగుపెట్టాడు. 15 నెలల వయసున్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలు ఎత్తుకుని తీసుకు వచ్చారు. దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన పృథ్వీ ఆకాష్ అంబానీని మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌కు పంపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. పృథ్వీ అంబానీ తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకోవడం విశేషం.