NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమీలియోలో అరుదైన శస్త్ర చికిత్స…

1 min read

మీ సింట్రిక్ లింఫాటిక్ సిస్ట్ వ్యాధితో ఐదు నెలలుగా బాధపడుతున్న చిన్నారికి శస్త్ర చికిత్స

రిసిక్షన్ అండ్ అనాస్టమోసిస్ ఆపరేషన్ తో చిన్నారికి నొప్పి ఉపశమనం

కర్నూలు న్యూస్ నేడు : కర్నూలు నగరంలోని అమీలియో హాస్పిటల్ లో చేసిన రిసిక్షన్ అండ్ అనాస్టమోసిస్ ఆపరేషన్ విజయవంతమైనట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ చాపే వెల్లడించారు. గురువారం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడియాట్రిక్ సర్జన్ డా.కృష్ణ నాయక్, జనరల్ సర్జన్ డా. రామచంద్రయ్యతో కలిసి శస్త్ర చికిత్స వివరాలను ఆయన వెల్లడించారు. మందకల్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బిందు  అనే బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ వైద్య చికిత్స కోసం కర్నూలు నగరంలోనీ పలు హాస్పిటల్స్ సందర్శించినా ఫలితం లేకపోయిందన్నారు. క్రిటికల్ కేసు కావడంతో ఏ హాస్పిటల్ వారు ముందుకు రాలేదన్నారు.  చిన్నారి తండ్రి వెంకటేష్ నెల రోజుల క్రితం అమీలియో హాస్పిటల్ ను ఆశ్రయించారన్నారు.మీ సింట్రిక్ లింఫాటిక్ సిస్ట్ అనే వ్యాధితో చిన్నారి భాధపడుతుందని గుర్తించిన ఆసుపత్రి వైద్యులు వ్యాధి తీవ్రత, చికిత్స విధానం అందులో ఉండే ప్రమాదాన్ని క్షుణంగా వివరించి  పీడియాట్రిక్ సర్జన్ డా. కృష్ణ నాయక్, డాక్టర్ రామచంద్రయ్య ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేయడం జరిగిందన్నారు. శస్త్ర చికిత్స విజయవంతమై బాలిక ఆరోగ్యంగా ఇంటికి వెళ్లిందన్నారు. అధునాతన పరికరాలు, నిపుణులైన  వైద్య బృందం మా హాస్పిటల్ లో ఉనందున ఇటువంటి ప్రమాదకర కేసును ఛాలెంజ్ గా తీసుకొని విజయం సాధించగలింగామన్నారు.అంతే కాకుండా మా హాస్పిటల్ లో అన్ని రకాల రోగాలకు  మెరుగైన వైద్యం వేగంగా చికిత్స అందించడానికి మా వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మెసెంటెరిక్ లెంఫాడెనిటిస్లాంటి వ్యాధి రెండు లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని అది పుట్టుకతోనే వస్తుందని పీడియాట్రిక్ సర్జన్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు.  బంధువులు ఆపరేషన్ కి సిద్దమని చెప్పడంతో మే 30వ తేదీన 3 గంటలు శ్రమించి ఆపరేషన్ విజవంతంగా చేశామన్నారు. శస్త్ర చికిత్స లో పాల్గొన్న పీడియాట్రిక్ సర్జన్ డా. కృష్ణ నాయక్, జనరల్ సర్జన్ డా.రామచంద్రయ్య, అనస్థీషియాలజిస్ట్డా.విజేత, ఆపరేషన్ కు సహకరించిన బృందానికి హాస్పిటల్స్ అధినేత కృతజ్ఞతలు తెలిపారు.

About Author