కెనరా బ్యాంకు 120 వ్యవస్థాపక దినోత్సవం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కెనరా బ్యాంకు 120 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ ఆర్ రామచంద్రరావు కర్నూలు నగర ట్రాఫిక్ సిఐ మన్సూర్ద్దిన్ కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.గత 120 సంవత్సరాలుగా దేశ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ లలో కెనరా బ్యాంకు ముందు స్థానంలో ఉందని సీఐ మన్సూరుద్దీన్ ప్రశంసించారు.లీడ్ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలలో ముందుండి కెనరా బ్యాంకు సేవలు అందిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన ఈ కార్యక్రమంలో కర్నూలు నగరంలో వివిధ చోట్ల ఈ వారం రోజులపాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు కర్నూలు జిల్లాలో 34 బ్రాంచ్ లతో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలతో కెనరా బ్యాంకు ఎల్లప్పుడూ ముందు స్థానంలో ఉంటుందని, జూన్ ఒకటవ తారీఖు నుంచి సేవింగ్స్ ఖాతాలో నగదు నిల్వల నిర్వహణకు ఎలాంటి చార్జీలు లేవని ఇలాంటి మరెన్నో సేవలు కెనరా బ్యాంకులో ప్రత్యేకంగా ఉన్నాయని జిల్లా ప్రజలు కెనరా బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు.ధన్యవాదములతో,యస్. ఆర్.రామచంద్ర రావు,జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్,కర్నూలు.

