PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తప్పులు లేని  ఓటర్ల జాబితాను రూపొందించాలి

1 min read

– జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.సృజన ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లను అదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 పై ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లతో   జిల్లా కలెక్టర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ను రూపొందించాలని  ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లను కలెక్టర్ అదేశించారు.  సెప్టెంబర్ 15 నాటికి పెండింగ్ లో  ఉన్న  ఫార్మ్స్ ను  తగిన ధృవ పత్రాలతో  డిస్పోజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  జంక్ క్యారెక్టర్స్, ఒకే ఇంట్లో పది మంది కంటే ఎక్కువగా ఉన్న ఓటర్లకు సంబంధించి డిస్పోజ్ చేసి ఈఆర్ఓ నెట్ లో అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎఈఆర్ఓ లను అదేశించారు. ఎవరైనా  తగిన డాక్యుమెంటేషన్ లేకుండా డిస్పోస్ చేస్తే సంబంధిత ఎఈఆర్ఓ ల మీద చర్యలు తప్పవన్నారు.   ఫోటోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎంట్రీలు, డెత్ కేసులు, జంక్ క్యారెక్టర్స్ కు సంబంధించి కచ్చితంగా ఎలక్షన్ కమీషన్ ఆదేశాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన తర్వాత వారితో మినిట్స్ లో కూడా సంతకం తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ ఓటర్లు, తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు, క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు, అత్యధిక మహిళ ఓటర్లు,  ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు సందర్శించాలని ఎఈఆర్ఓ లను కలెక్టర్ అదేశించారు. 100 శాతం పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన తర్వాతే పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ చేయాలన్నారు.. ముఖ్యంగా ఒకే కుటుంబంలోని కుటుంబ సభ్యులను ఒక్కటే పోలింగ్ స్టేషన్ లో  ఉండేలా చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కరెంట్, త్రాగు నీరు, ర్యాంప్, ఓటర్లకు ఎండ తగలకుండా టెంట్ ఉండాలని, టాయ్లెట్ విత్ రన్నింగ్ వాటర్ ఉండే విధంగా చూసుకోవాలన్నారు.. ర్యాంప్ లేని వాటిని గుర్తించి నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ మధుసూధన్ రావు, ఎఈఆర్ఓ లు తదితరులు పాల్గొన్నారు.

About Author