తీవ్ర తుఫాన్ గా మారనున్న `అనని` !
1 min read
పల్లెవెలుగువెబ్ : అనని
తుఫాన్ రేపు తీవ్రంగా మారనుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలపడింది. విశాఖకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ‘అసాని’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ,బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో అసని తుపాను కదులుతోంది. అసని తుపాను కారణంగా 3 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.