మళ్లీ అన్న క్యాంటిన్లు ప్రారంభించాలి : టి.జి భరత్
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటిన్లను ప్రజలు కోరుకుంటున్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. బుధవారం నగరంలోని 8వ వార్డులో ఒక్క రోజు అన్న క్యాంటిన్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న క్యాంటిన్ ప్రారంభించి పేదలకు ఉచితంగా భోజనం పెట్టారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ తమిళనాడులో ప్రభుత్వం మారినా అమ్మ క్యాంటిన్లను కొనసాగిస్తున్నారన్నారు. ఏపీలో కూడా ప్రభుత్వం మళ్లీ అన్న క్యాంటిన్లు ప్రారంభించాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి అన్న క్యాంటిన్ల విలువ తెలియజెప్పేందుకే కర్నూల్లోని 33 వార్డుల్లో ఒక్క రోజు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పేదల కడుపునిండడం ప్రభుత్వానికి ఇష్టం లేదని సోమిశెట్టి అన్నారు. 2024 ఎన్నికల్లో కర్నూల్లో భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని నగరాన్ని అభివృద్ది చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ పరమేష్, క్లస్టర్ ఇంచార్జి రమేష్, నేతలు షరీఫ్, నాగార్జున, కస్తూరి వెంకటేశ్వర్లు, మంజు, జుబేర్, రమేష్, ప్రసాద్, పెద్దయ్య, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.