యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ ను తనిఖీ చేసిన.. కర్నూలు జిల్లా ఎస్పీ
1 min read
పల్లెవెలుగు కర్నూలు: ఈవ్‌టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడే వారి పై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ హెచ్చరించారు. ఈ సంధర్బంగా మంగళవారం దేవనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ ను తనిఖీ చేశారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…ఈవ్ టీజింగ్ , ఆకతాయిల వల్ల విద్యార్ధులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకువచ్చే విధంగా విద్యార్ధిని, విద్యార్దులకు అవగాహన చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవ్ టీజింగ్ ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ బీట్స్ ను కొత్తగా అమలులోకి తీసుకొచ్చామన్నారు.వివిధ కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్ ను అరికట్టడం కోసం ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు నిర్వర్తించే విధంగా ఆదేశించామన్నారు. అధే విధంగా ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నామన్నారు. ఈవ్ టీజింగ్ పాల్పడే వారి పై నిఘా ఉంచి 811 మందిని ఇప్పటివరకు జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలలో, పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ బీట్స్ పోలీసులు కౌన్సిలింగ్ చేశారని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ తో పాటు దేవనకొండ సిఐ వంశీనాథ్ , పోలీసు సిబ్బంది ఉన్నారు.