NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆవోపా సేవలు అభినందనీయం: టీజీ వెంకటేష్

1 min read

 పల్లెవెలుగు వెబ్​: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ (ఆవోపా) చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందించదగ్గవని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.  ఆవోపా ఏర్పడి 50 సంవత్సరాలైన సందర్భంగా ,  గాంధీ జయంతిని పురస్కరించుకుని  ఆదివారం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, మేధావులకు ఆవోపా ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.  కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విభిన్న రంగాలలో ప్రతిభావంతులైన వారిని  సన్మానించడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి చేస్తున్నటువంటి కృషి మరువలేనిది అని అన్నారు. ప్రతిభ ఉండి అవకశాలు లేని వారికి, వారి ప్రతిభకు అనుగుణంగా తగిన అవకాశాలు కల్పించడంలో చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఇక్కడ ఉన్న ప్రతిభావంతులకు ఎక్కడ ఉన్న అమెరికాలో అవకాశాలు కల్పించడంలో ఆవోప చేసిన కృషి విస్మరించరానిదని టీజీ అన్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, మరే ఇతర ప్రమాదాలు వచ్చనా.. ఆదుకునేందుకు మేమున్నామంటూ ఆవాపా ముందుకు రావడం, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తనవంతుగా సమాజాభివృద్ధికి పాటుపడడం అభినందించదగ్గ విషయమని టీజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆవోప నాయకులు నాగేశ్వరరావు, జవహర్ బాబు, యుగంధర్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

About Author