ఏపీ సలహాదారు ఆకునూరి మురళి రాజీనామా
1 min read
పల్లెవెలుగువెబ్: ఏపీ ప్రభుత్వంలో విద్యా శాఖ సలహాదారుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.మురళి తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే… పలువురు వ్యక్తులను జగన్ సర్కారు సలహాదారులుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. వీరిలో పలువురు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇలా తెలంగాణకు చెందిన మురళి ఏపీ విద్యా శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. గడచిన మూడేళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.